సాక్షి, హైదరాబాద్: చివరి విడత రుణమాఫీకి విడుదల చేసిన నిధులు సరిపోకపోవడంతో మరో రూ. 19.22 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడో విడత రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం రూ. 4,025 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, రూ. 4 వేల కోట్లే విడుదల చేసింది. ఈ సొమ్ము సరిపోదని జిల్లా వ్యవసాయాధికారులు విన్నవించడంతో ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. ఈ మేరకు పరిపాలనా అనుమతినిస్తూ వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు.
రుణమాఫీకి రూ.19.22 కోట్లు విడుదల
Published Thu, Aug 31 2017 3:03 AM | Last Updated on Tue, Sep 12 2017 1:23 AM
Advertisement
Advertisement