అటవీ ప్రాంతంలో మంటలు
నాగిరెడ్డిపేట: తాండూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో గురువారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఫారెస్ట్ అధికారులు పెంచుతున్న నీలగిరి చెట్లు కొంతమేర దెబ్బతిన్నాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న డీఎఫ్‌ఆర్వో రవికుమార్, బీట్ అధికారి నవీన్ ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. చెలరేగిన మంటలను ఆర్పివేశారు. కాగా మండలంలోని బంజర సమీపంలో గల అటవీ ప్రాంతంలోనూ బుధవారం రాత్రి మంటలు చెలరేగడంతో ఫారెస్ట్ అధికారులు అక్కడికి వెళ్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఇటీవల మాల్తుమ్మెద విత్తనోత్పత్తి క్షేత్రంలోనూ మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. మండలంలో జరుగుతున్న వరుస ఘటనలతో ఫారెస్ట్ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment