పరీక్షలంటే భయం వీడాలి
ఎల్లారెడ్డిరూరల్: విద్యార్థులు పరీక్షలంటే భయం వీడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. గురువారం ఆయన ఎల్లారెడ్డి పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. కష్టపడి చదవాలని సూచించారు. ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్ ద్వారా చదువుపై దృష్టి సారించాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో ప్రభాకర్, తహసీల్దార్ మహేందర్, మున్సిపల్ కమిషనర్ మహేష్‌కుమార్, ఆర్సీవో గంగారాం నాయక్, ప్రిన్సిపల్ సావిత్రి, ఎంపీవో ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
డబుల్‌బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గిరిజన బాలికల గురుకుల పాఠశాలను సందర్శించి వెళ్తుండగా స్థానికులు ఆయనను కలిశారు. నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందించారు.
చదువులపై దృష్టి సారించాలి
గురుకుల విద్యార్థులతో
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Comments
Please login to add a commentAdd a comment