నేడు డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్
కామారెడ్డి టౌన్: నిజామాబాద్ రీజియన్ పరిధిలోని ఆర్టీసీ డిపోలలో శుక్రవారం డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంస్థ రీజినల్ మేనేజర్ టి.జ్యోత్స్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు ఫోన్ చేసి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.
ఫోన్ చేయాల్సిన నంబర్లు..
రీజినల్ మేనేజర్, నిజామాబాద్
99592 26011
డిపో మేనేజర్, కామారెడ్డి 99592 26018
డిపో మేనేజర్, బాన్సువాడ 99592 26020
‘నాణ్యమైన విద్యుత్
సరఫరా చేస్తాం’
కామారెడ్డి టౌన్: వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రావణ్ కుమార్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని పలు సబ్ స్టేషన్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి సర్కిల్ పరిధిలో ఈ నెలలో ఒకరోజులో గరిష్ట విద్యుత్ డిమాండ్ 7.045 మిలియన్ యూనిట్లుగా నమోదయ్యిందన్నారు. రాబోయే మూడు నెలల్లో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
నేడు డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment