సీసీ కెమెరాలతో అనేక ప్రయోజనాలు
కామారెడ్డి క్రైం: సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయని మల్టీ జోన్–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాల ప్రాధాన్యతను గుర్తించాలన్నారు. గురువారం ఆయన కామారెడ్డికి వచ్చారు. జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం, పట్టణంలోని ఇంటర్నేషనల్ హోటల్ నుంచి ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వరకు ప్రధాన రహదారి వెంట నూతనంగా ఏర్పాటు చేసిన 98 సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో సహకరించిన ఈ ప్రాంతంలోని దాతలందరినీ అభినందించారు. దొంగతనాలు, మహిళలపై వేధింపులు, చైన్‌స్నాచింగ్, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా ఉండడానికి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఏదైనా ఘటన జరిగినా వెంటనే గుర్తించడానికి వీలు ఉంటుందన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలు, వ్యాపార సముదాయాల వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు రావాలని సూచించారు. అనంతరం సీసీ కెమెరాల కోసం విరాళాలు అందించినవారిని, సేకరణకు కృషి చేసిన కానిస్టేబుల్ కమలాకర్ రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో ఎస్పీ సింధు శర్మ, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, అసిస్టెంట్ ఎస్పీ చైతన్యరెడ్డి, పట్టణ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలి
మల్టీ జోన్–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment