కామారెడ్డి టౌన్: విద్యార్థులు, యువత పలు కార్యక్రమాల వేదికలపై మాట్లాడేందుకు ప్రసంగ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని ఇంపాక్ట్ ట్రైనర్, ప్రముఖ మోటివేటర్ వజ్జ నవనీత తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌కే డిగ్రీ, పీజీ కళాశాలలో ఎఫెక్టీవ్ పబ్లిక్ స్పీచ్ అంశంపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఆత్మవిశ్వాసంతో మాట్లాడే పద్ధతులు, స్వర నిబంధన, శరీర భాష, ప్రేక్షకులను ఆకర్షించే విధానాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో కళాశాల సీఈవో జైపాల్‌రెడ్డి, ట్రైనర్ నారాపురం రాజు, జేసీఐ ఉపాధ్యక్షుడు మర్రి సదాశివరెడ్డి, ప్రిన్సిపల్ సైదయ్య, దత్తాద్రి, నవీన్‌కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.