భిక్కనూరు: తెలంగాణ యునివర్సీటీ సౌత్‌క్యాంపస్‌లో ప్రపంచ సోషల్ వర్క్ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి టి.నాగరాణి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సేవ కార్యక్రమాలపై దృష్టిసారించాలన్నారు. సమాజసేవతోనే గుర్తింపు వస్తుందన్నారు. తదుపరి రెడ్ క్రాస్ సంస్థ ఆద్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుధాకర్‌గౌడ్, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరీ, వార్డు సంస్థ డైరెక్టరర్ మల్లవరపు ప్రసాద్ అధ్యాపకులు యాలాద్రి నర్సయ్య, రమాదేవి, సబిత మోహన్‌బాబు, లలిత, హరిత ఏపీఆర్‌వో సరిత,నారాయణ తదితరులు పాల్గొన్నారు.