కామారెడ్డి రూరల్: మానవ అక్రమ రవాణా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని మానవ అభివృద్ధి విభాగం డీపీఎం రమేష్‌బాబు అన్నారు. కామారెడ్డి మండల సమాఖ్య కార్యాలయంలో మానవ అక్రమ రవాణా నిరోధకపై జిల్లాలోని 8 మండలాల ఐకేపీ ఏపీఎంలకు, సీసీలకు మానవ అక్రమ రవాణా అంశంపై మంగళవారం శిక్షణ నిర్వహించారు. ఈకార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మానవ అక్రమ రవాణా ద్వారా లైంగిక దోపిడి, అవయవ దోపిడి, శ్రామిక దోపిడి, డ్రగ్స్ రవాణా లాంటి అసాంఘిక కార్యకలపాలపై తరుచూ ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలు, పోక్సో చట్టం, బీఎన్‌ఎస్ చట్టం, నివారణ చర్యలు చట్టాల పై అవగాహన, సైబర్ ఆధారిత అక్రమ రవాణా లైంగిక అక్రమ రవాణా చట్టాలపై అవగాహన కల్పించారు. శిక్షణ అనంతరం గ్రామాలలోని చిన్న సంఘాల సమావేశం లలో సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్‌డీవో మురళీ కృష్ణ, ఏపీఎంలు ప్రసన్న రాణి, శ్రీనివాస్, గజాబింకర్ శ్రీనివాస్, రాజు, శిరీష, గంగాధర్, మోయిజ్, రామచంద్ర గౌడ్, ఎనిమిది మండలాల సీసీలు, టీవోటీలు రాజేందర్, జగదీష్ కుమార్, శ్రీనివాస్, అన్నపూర్ణ, గీత తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలకు ప్రింటర్ అందజేత
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని పోతంగల్ కలాన్ జెడ్పీ ఉన్నత పాఠశాలకు బదిలీపై వెళ్లిన సైన్స్ ఉపాధ్యాయురాలు వేల్పుల గీత మంగళవారం ప్రింటర్ ను బహూకరించినట్లు హెచ్‌ఎం రంగారావు తెలిపారు. పాఠశాలలో మంగళవారం ఆమెకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామస్తులు పాల్గొన్నారు.
పాఠశాలలో బెంచీల కోసం విరాళం
బాన్సువాడ రూరల్: మండలంలోని బోర్లం జెడ్పీహైస్కూల్‌లో విద్యార్థులకు ఇనుప బెంచీల కోసం ఆపాఠశాల పూర్వవిద్యార్థులు విరాళాలు అందజేస్తున్నారు. మంగళవారం 2008–09 పదోతరగతి బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు పలువురు రూ.10వేల ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటరమణ, మన్నె అనిల్, సయ్యద్ మెహరాజ్, వేణుగోపాల్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.