నిజాంసాగర్ : దశాబ్దాలుగా శ్మశానానికి ఉపయోగిస్తున్న అసైన్డ్, పరంపోగు భూములపై కొందరు కన్నేశారు. రికార్డులు మార్చి పట్టాలు పొందడమే కాకుండా ఏళ్లుగా రైతుబంధును తీసుకుంటూ లబ్ధి పొందుతున్నారు. మహమ్మద్‌నగర్ మండలంలోని తెల్గాపూర్ గ్రామశివారులో ఉన్న అసైన్డ్, పరంపోగు భూములను కొన్నేళ్ల క్రితం శ్మశానం, బొందల గడ్డకు కేటాయించారు. దీంతో అప్పటి నుంచి గ్రామంలో ఎవరైనా మరణిస్తే ఆ భూముల్లోనే సమాధి చేస్తున్నారు. గత ప్రభుత్వం కొత్త పట్టాదారు పాసుబుక్కులు జారీ చేయడంతో ఓ గ్రామ రెవెన్యూ అధికారి సహకారంతో రెండు కుటుంబాలు ఆ భూములను తమ పేరిట పట్టా చేయిచుకున్నాయి. 310 సర్వే నంబరుతోపాటు 310 /2, 312, 313, 315, 316, 317, 318 సర్వే నంబర్లల్లో ఉన్న దాదాపు 10 ఎకరాల భూములకు పట్టాలు పొందారు. ఆ భూములలో పెద్దపెద్ద బండరాళ్లు, భారీ వృక్షాలున్నాయి. 2018 సంవత్సరం నుంచి ఆ భూములకు రైతుబంధు అందుతోంది.
భూకబ్జాపై ఆందోళనలు
బొందలగడ్డ భూములను పట్టా చేయించుకోవడంతోపాటు రైతుబంధు చెల్లింపులపై గ్రామస్తులు ఆందోళనబాట పట్టారు. తెల్గాపూర్ వాసులంతా ఇటీవల మహమ్మద్‌నగర్ తహసీల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ విషయాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
రికార్డులు మార్చి పట్టాలు పొందిన వైనం
చర్యలు తీసుకోవాలని కోరుతున్న
తెల్గాపూర్‌వాసులు