
హనుమాన్ ఆలయంలో ఉత్సవాలు ప్రారంభం
మద్నూర్(జుక్కల్): మడలంలోని సలాబత్‌పూర్ హనుమాన్ ఆలయం హనుమాన్ జయంతి వేడుకలకు ముస్తాబువుతోంది. ఆదివారం నుంచి వారం రోజుల పాటు ఆలయంలో కీర్తన, భజన, సప్తాహం తదితర కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. హనుమాన్ జయంతి వరకు నిత్యం ఆలయంలో భజనలు, కీర్తనలు నిర్వహిస్తామన్నారు. చివరి మూడు రోజుల పాటు జాతర, కుస్తీ పోటీలు ఉంటాయన్నారు.
మార్మోగ్రిన రామనామస్మరణ
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని బ్రాహ్మణపల్లి అంజనాద్రి ఆలయం వద్ద స్థానిక ఆలయకర్త పట్లోళ్ల కిషోర్ కుమార్ ఆంజనేయస్వామి పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. మల్లూర్ పీఠాధిపతులు రాజేశ్వర శర్మ నేతృత్వంలో పడిపూజ ఉత్సవాలు వైభవంగా జరిపారు. పలు మండలాల నుంచి హనుమాన్ స్వాములు పడిపూజకు తరలి వచ్చారు.
ముగిసిన లలితా
నవరాత్రి ఉత్సవాలు
ఎల్లారెడ్డిరూరల్: బగళాముఖి అమ్మవారి పీఠంలో ఉగాది నుంచి ప్రారంభమైన లలిత నవరాత్రి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయని జ్యోతిష్య పండితులు క్రాంతి పటేల్ తెలిపారు. నవరాత్రి ఉత్సవాల ముగింపులో భాగంగా బగళాముఖి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
ఘనంగా బోనాల పండుగ
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలంలోని భిక్కనూర్ గ్రామంలో ఆదివారం బోనాల పండుగ నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవంలో భాగంగా గ్రామంలోని పెద్దమ్మ తల్లి, నల్ల పోచమ్మ అమ్మవార్లకు మహిళలు బోనాలతో శోభాయాత్ర నిర్వహించి అమ్మవారికి బోనాలను సమర్పించారు. పిల్లా పాపలు పాడి పంటలు సల్లంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.

హనుమాన్ ఆలయంలో ఉత్సవాలు ప్రారంభం

హనుమాన్ ఆలయంలో ఉత్సవాలు ప్రారంభం

హనుమాన్ ఆలయంలో ఉత్సవాలు ప్రారంభం