
రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర
రామారెడ్డి/దోమకొండ: రామారెడ్డి మండలకేంద్రంలో, దొమకోండ మండలం అంచనూరు, సీతారాంపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు సోమవారం జై భీమ్, జై బాబు జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను కాంగ్రెస్ నాయకులు చేపట్టారు.రామారెడ్డిలో అంబేడ్కర్, గాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించారు.ఈకార్యక్రమంలో రామారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మాగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శిలాసాగర్, మైనారిటీ మండల అధ్యక్షుడు ఇర్పాన్, దోమకొండ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి, నాయకులు రామస్వామి గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రాజం, నాయకులు పాల్గొన్నారు.
విద్యార్థులకు స్పేస్ ఇంజినీరింగ్‌పై అవగాహన
భిక్కనూరు/మాచారెడ్డి : విద్యార్థులు ఉపగ్రహల పనితీరు, వాటితో కలిగే లాభాలపై అవగాహన పెంచుకోవాలని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రిటైర్డ్ ఇంజినీర్ డాక్టర్ రఘువర్మ అన్నారు. సోమవారం భిక్కనూరు మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల, పాల్వంచ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆయన స్పేస్ ఇంజినీరింగ్‌పై ఆయన అవగాహన కల్పించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు స్పేస్ ఇంజనీరింగ్‌పై అవగాహన కల్పిస్తే రాణిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంలు రాజగంగారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఎంఈవో రాంమనోహర్ రావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర