
● ప్రమాదకరంగా మారిన స్పీడ్ బ్రేకర్లు
మండల కేంద్రంలోని బస్టాండులో ఇటీవల ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు ప్రమాదకరంగా మారాయని ప్రయాణికులు,ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కొంచెం ఏటవాలుగా ఏర్పాటు చేస్తే బాగుండేదని పలువురు డ్రైవర్లు అభిప్రాయ పడ్డారు. స్పీడ్ బ్రేకర్ ఎత్తుగా ఉండటంతో తరుచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. శనివారం కరీంనగర్ డిపోనకు చెందిన ఈ ఎక్స్ ప్రెస్ స్పీడ్ బ్రేకర్ వద్ద ఆగిపోయింది. కొంచెం స్పీడ్ గా వెళ్తే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని, స్లో గా వెళ్తే బస్సులు ఆగిపోతున్నాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజుల క్రితం స్పీడ్ బ్రేకర్ దాటేప్పుడు పలువురు ప్రయాణికులు గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. వెంటనే అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్ల ఎత్తు తగ్గించాలని ప్రజలు కోరారు. – మాచారెడ్డి