ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డిరూరల్ : ప్రతి విద్యార్థి కన్న కలలను సాకారం చేసుకోవడానికి కృషి చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్నారు. మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులు అన్ని రంగాలలో ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కథల పుస్తకాలు రాయడం సంతోషాన్ని కలిగించిందన్నారు. టీహబ్ తరహాలో ఎల్లారెడ్డిలో వై హబ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నానని, ఇందుకోసం 50 ఎకరాల స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్‌ను కోరానని తెలిపారు. కళాశాలకు ప్రభుత్వం కేటాయించిన 23 ఎకరాల భూమిలో ఒక్క అంగుళం కూడా కబ్జా కాకుండా చూస్తానన్నారు. కబ్జాకు పాల్పడిన వారి నుంచి భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. విద్యార్థులు రాసిన కథల పుస్తకాలు, కళాశాల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. డిగ్రీ కళాశాలలో డ్రెయినేజీ నిర్మాణానికి రూ.30 లక్షలు కేటాయిస్తున్నానని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని ఏఈకి సూచించారు. కళాశాలకు స్వాగత తోరణం నిర్మాణానికి కళాశాల అభివృద్ధి కమిటీ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. పట్టణంలో రూ. 5లక్షలతో నిర్మించనున్న టీఎన్‌జీవో కార్యాలయ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిపేటలో జరుగుతున్న అమృత్ 2.0 పనులను ఆయన పరిశీలించారు. రూ. 35 కోట్లతో పనులు జరుగుతున్నాయని, నాణ్యతగా చేపట్టాలని సూచించారు.ఎల్లారెడ్డి మండలం మండలం సాతెల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఎల్లారెడ్డి మండలం రుద్రారం గ్రామంలోని చాకలి సాయిలు అనే లబ్ధిదారుడి ఇంట్లో ఎమ్మెల్యే భోజనం చేశారు. ఎల్లారెడ్డి మండలం మత్తమాల గ్రామంలో ఎమ్మెల్యే, జైబాపు, జైభీం, జైసంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులతో కలిసి పాదయాత్ర చేశారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు శంకర్, చంద్రకాాంత్, ప్రభాకర్, సిద్దు, వసంత లక్ష్మి, గంగారెడ్డి, ఆర్డీవో మన్నె ప్రభాకర్, తహసీల్దార్ ప్రేమ్‌కుమార్, డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సీఐ రవీందర్‌నాయక్, ఎస్సై మహేష్, సీడీపీసీ సభ్యులు శ్రీనివాస్, కంచర్ల బాలకిషన్, ముత్యపు సుదర్శన్, విద్యాసాగర్, ఏఎంసీ చైర్‌పర్సన్ రజిత, మున్సిపల్ మాజీ చైర్మన్లు పద్మశ్రీకాంత్, కుడుముల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు వినోద్‌గౌడ్, సాయిబాబా, కాంగ్రెస్ నాయకులు, టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షులు వెంకట్‌రెడ్డి, తాలుకా అధ్యక్షులు మహిపాల్, కార్యదర్శి చరణ్ తదితరులు పాల్గొన్నారు.
టీహబ్ తరహాలో
ఎల్లారెడ్డిలో వై హబ్ ఏర్పాటు
ఎమ్మెల్యే మదన్మోహన్ రావు
విద్యార్థి కలలను సాకారం చేసుకోవాలి