
జిల్లాలో మరో 10 సహకార సంఘాలు..
కామారెడ్డి క్రైం: జిల్లాలో మరో 10 వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సంఘాలను పునర్‌వ్యవస్థీకరించాలని జిల్లా సహకార అభివృద్ధి కమిటీ నిర్ణయించిందన్నారు. మరో 10 సింగిల్ విండోల ఏర్పాటు ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీకి పంపిస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, డీఆర్‌డీవో సురేందర్, డీసీవో రామ్మోహన్, డీఎస్‌వో మల్లికార్జున్ బాబు, డీఏవో తిరుమల ప్రసాద్, డీఎఫ్‌వో శ్రీపతి తదితరులు పాల్గొన్నారు.