
రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల వెల్లువ
కామారెడ్డి టౌన్: రాజీవ్ యువ వికాసం పథకానికి పట్టణంలోని అభ్యర్థులు మీసేవా కేంద్రాలలో భారీగా దరఖాస్తు చేసుకుంటున్నా రు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ద రఖాస్తుల స్వీకరణ కేంద్రం ఏర్పాటు చేశా రు. మీ సేవాకేంద్రాలలో దరఖాస్తు చేసుకు న్న వారు మున్సిపల్ కార్యాలయంలో దర ఖాస్తు ఫారాలను సమర్పిస్తున్నారు. ఇప్పటి వరకు 1,500లకుపైగా దరఖాస్తులు వచ్చా యని సిబ్బంది తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువుంది.
కామారెడ్డి బార్ అసోసియేషన్
కార్యవర్గం ఎన్నిక
కామారెడ్డి టౌన్: కామారెడ్డి బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ప్రక్రియ అసోసియేషన్ భవనంలో ఎన్నికల అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగింది. అధ్యక్షుడిగా నంద రమేశ్, ప్రధాన కార్యదర్శిగా బండారి సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా మురళి, సంయుక్త కార్యదర్శిగా మోహన్‌రెడ్డి, కోశాధికారిగా వేణు ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా సలీం, అగ్రజ్, విఠల్‌రావు, అన్సార్, యాదగిరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి తెలిపారు.
రేపు బాన్సువాడకు ఎమ్మెల్సీ కవిత రాక
బాన్సువాడ : ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం బాన్సువాడకు రానున్నారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. పట్టణంలోని ఎస్‌ఎంబీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొంటారని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.
ఆర్టీసీ సిబ్బందికి ‘ప్రగతి చక్రం’ పురస్కారాలు
ఖలీల్‌వాడి: నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగు లకు మంగళవారం ‘ప్రగతి చక్రం’ పురస్కారాలను అందించామని ఆర్‌ఎం జ్యోత్స్న తెలిపారు. ఉత్తమ సిబ్బందికి త్రైమాసిక పురస్కారాలను అందజేశామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎం ఎస్ మధుసూదన్, డిపో మేనేజర్లు, పర్సనల్ ఆఫీసర్, సూపర్ వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల వెల్లువ

రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల వెల్లువ