
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని మేడిపల్లి అటవీ శివారులో జరిగిన అమీనాబేగం అనే మహిళ హత్యకేసులో నిందితుడు కేతావత్ పీరాజీని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సదాశివనగర్ సీఐ సంతోష్‌కుమార్ మంగళవారం తెలిపారు. వివరాలు ఇలా.. పీరాజీ మేడిపల్లి గ్రామ పరిసరాల్లో తిరుగుతుండగా అరెస్టు చేసి పోలీస్టేష్‌న్‌కు తీసుకొచ్చామన్నారు. అతడిని విచారించగా అమీనా బేగంపై దాడి చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. మహిళపై దాడి చేసిన కర్రను స్వాధీనం చేసుకొని పీరాజీని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. గాంధారి ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది ఉన్నారు.