
బస్సులు రావడం లేదని రోడ్డెక్కారు
రామారెడ్డి : మండలంలోని మద్దికుంట గ్రామానికి ఆర్టీసీ బస్సులు రావడం లేదని బుధవారం మద్దికుంట మర్రి వద్ద విద్యార్థులు, గ్రామస్తులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో గ్రామానికి ఆర్టీసీ బస్సులు ఏడు ట్రిప్పులు వచ్చేవని, ప్రస్తుతం ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు రెండు ట్రిప్పులు మాత్రమే వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన విధంగా గ్రామానికి ఏడు ట్రిప్పులు నడిపించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాతో కామారెడ్డి వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. రామారెడ్డి పోలీసులు గ్రామస్తులను సముదాయించి ధర్నాను విరమింపజేశారు. ఈవిషయమై ఆర్టీసీ డీఎం కరుణశ్రీని ‘సాక్షి’ వివరణ కోరగా బస్సులను తిరిగి పునరుద్ధరిస్తామని గ్రామస్తులకు తెలియజేశామని తెలిపారు.
ధర్నాకు దిగిన మద్దికుంట గ్రామస్తులు
ట్రిప్పులు తగ్గించారని ఆగ్రహం