
రాజ్యాంగాన్ని బలహీన పర్చే కుట్రలను తిప్పికొడదాం
బాన్సువాడ రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని, దాన్ని మౌలిక సూత్రాలను బలహీన పర్చేందుకు చేస్తున్న కుట్రలను తిప్పికొడదామని యువజన కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మధుసూదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని తాడ్కోల్ గ్రామంలో నిర్వహించిన జైబాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అణగారిన వర్గాలకు బీజేపీ అన్యాయం చేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా యువకులు, ప్రజలు రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బలహీన వర్గాల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం చేస్తుందన్నారు. గ్రామంలో అంబేడ్కర్, గాంధీ చిత్రపటాలు, రాజ్యాంగాన్ని చేతబూని అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో నాయకులు కాసుల రోహిత్, బుడిమి సహకార సంఘం చైర్మన్ గంగుల గంగారాం, కుమ్మరి రాజు, లక్ష్మాగౌడ్, విఠల్‌రెడ్డి, గోపి, జగన్, దర్జి హన్మాండ్లు, తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర
నిజాంసాగర్/తాడ్వాయి: నిజాంసాగర్ మండలం సుల్తాన్ నగర్ గ్రామంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. గ్రామంలోని విధుల్లో తిరుగుతూ జై భీం, జై బాపు, జై సంవిధాన్ నినాదాలతో ర్యాలీ తీశారు. తాడ్వాయి మండలం చిట్యాల, సంతాయిపేట్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జైబాపు, జైభీం, జైసంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా గాంధీ, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ మండలాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.