
పోరాటానికి సహకరిస్తాం..
ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు కోసం విద్యార్థి సంఘాల ఆధ్వ ర్యంలో జరిపే పోరాటాలకు పూర్వ విద్యార్థులుగా మావంతు సహకారం అందజేస్తాం. విద్యార్థుల చేతుల్లోనే వర్సిటీ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇంజనీరింగ్ కాలేజీ వస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్య అందుబాటులోకి వస్తుంది. కాలేజీ ఏర్పాటుకు అవసరమైన సువిశాల స్థలం, ఫ్యాకల్టీ ఇప్పటికే అందుబాటులో ఉన్నారు.
– పుప్పాల రవి, తెయూ
రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విద్యార్థుల తలరాత మారడం లేదు. ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలకు విచ్చలవిడి అనుమతులు ఇస్తున్న ప్రభుత్వం.. ప్రభుత్వ యూనివర్సిటీల అభివృద్ధి, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటుపై చిత్తశుద్ధి చూపడం లేదు. తెయూలో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు ‘సాక్షి’ తీసుకుంటున్న చొరవ అభినందనీయం.
– ప్రిన్స్, పీడీఎస్‌యూ నగర కార్యదర్శి
తలరాత మారడం లేదు..

పోరాటానికి సహకరిస్తాం..