
హార్వెస్టర్ ఢీకొని ఒకరి మృతి
డిచ్‌పల్లి: డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ గ్రామంలో శనివారం హార్వెస్టర్ ఢీకొని అరిగెల గంగాధర్ (59) మృతి చెందినట్లు ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అరిగెల గంగాధర్ రాజారాం నగర్‌కు చెందిన సోనారి గోవింద్‌తో కలిసి బైక్‌పై గ్రామంలోని హనుమాన్ ఆలయానికి వెళుతున్నారు. మార్గమధ్యలో వీరి ముందు వెళుతున్న హార్వెస్టర్‌ను డ్రైవర్ సింహాద్రి నిర్లక్ష్యంగా వెనక్కి తీయడంతో బైక్‌ను ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న గోవింద్ పక్కకు దూకగా, వెనుక కూర్చున్న గంగాధర్ హార్వెస్టర్ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో డిచ్‌పల్లి 30 పడకల ఆస్పత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు గంగాధర్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య బాలమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.