
మామిడి దిగుబడిపై ఆందోళన
నాగిరెడ్డిపేట: ఈ యేడు జిల్లాలో మామిడి దిగుబడి అంతంత మాత్రంగానే వస్తోంది. సీజన్ ప్రారంభంలో మామిడిచెట్లకు పూత అధికంగా వచ్చినప్పటికీ రోజురోజుకు పూత రాలిపోయింది. అనంతరం తె గుళ్లు దాడి చేయడంతో మరింత నష్టం వాటిల్లింది.
జిల్లాలో 1,745 ఎకరాల్లో మామిడితోటలున్నా యి. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో దశలవారీగా పూత వచ్చింది. అయితే వచ్చిన పూత సైతం రాలిపోయింది. చెట్లకు ఉన్న కొంతమేర పూత వల్ల కాసిన కాయలు పిందె దశలోనే పసుపురంగులోకి మారి రాలిపోయాయి. దీనికితోడు మామిడి తోటలను ప్రస్తుతం తేనెమంచు పురుగులు, బూడిద తెగులు ఆశించి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండడం లేదు. దీని ప్రభావం పంట దిగుబడిపై పడి మామిడి రైతులతోపాటు తోటలను కౌలుకు తీసుకున్న వారూ ఆర్థికంగా నష్టపోతున్నారు.
ప్రతికూల వాతావరణంతో
రాలిన పూత
తెగుళ్లతో మరింత నష్టం