
కేంద్రీయ విద్యాలయం కోసం ఉన్నత పాఠశాల పరిశీలన
మద్నూర్: కేంద్రీయ విద్యాలయం కోసం మద్నూర్‌లోని బాలుర ఉన్నత పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పరిశీ లించారు. కేంద్రీయ విద్యాలయం కోసం పక్షం క్రితం కేంద్రీయ విద్యాలయాల డిప్యూ టీ కమిషనర్ మంజునాథ్, డీఈవో రాజు మద్నూర్‌లో రెండు స్థలాలను పరిశీలించా రు. కానీ అవి అనుకులంగా లేవని తిరస్కరించారు. ఈసారి సరైన స్థలం చూపించకపోతే కేంద్రీయ విద్యాలయం ఇతర ప్రాంతాలకు తరలిపోయే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే హైస్కూల్‌ను పరిశీలించి, గదుల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలుర ఉన్నత పాఠశాలలో తాత్కాలికంగా కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామన్నారు. బాలుర ఉన్నత పాఠశాలను పక్కనే ఉన్న ప్రాథమిక, ఉర్దూ మీడియం పాఠశాల భవనంలో సర్దుబాటు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం ఉపాధ్యాయులు ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగ్‌నాథ్, విజయ్, భీం తదితరులున్నారు.
నేడు కామారెడ్డిలో
జాబ్ మేళా
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో న్యూలాండ్ లాబోరేటరీస్ ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధి కారి షేక్ సలాం సోమవారం ఒక ప్రకట న లో తెలిపారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీ సీ, ఫార్మాటెక్, ఎంఎల్‌టీ బ్రిడ్జి కోర్సు, బీఎ స్సీ కెమిస్ట్రీ పూర్తి చేసినవారు ఒరిజినల్ సర్టి ఫికెట్లతో జాబ్‌మేళాకు హాజరుకావాలన్నా రు. ఈనెల 16న బాన్సువాడ, 17న ఎల్లారె డ్డి, 18న బిచ్కుంద ప్రభుత్వ జూనియర్ క ళాశాలల్లో జాబ్ మేళాలు ఉంటాయన్నారు.
ఓరియంటల్ స్కూల్‌కు
పూర్వ విద్యార్థుల విరాళం
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఓరియంటల్ స్కూల్ అభివృద్ధి కోసం 2000–2001 పూర్వ విద్యార్థులు సోమవా రం లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. ప్ర స్తుత హెచ్‌ఎం సుధాకర్, పూర్వ హెచ్‌ఎం మురళిరెడ్డి, ఉపాధ్యాయుడు భాస్కరశర్మల ను సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ వి ద్యార్థులు రంజిత్‌కుమార్, చంద్రశేఖర్, అని ల్, కళ్యాణ్, స్వామి, ప్రసన్న, సంధ్య, కరుణ శ్రీ తదితరులు పాల్గొన్నారు.
నేడు బాన్సువాడకు ఎమ్మెల్సీ కవిత రాక
బాన్సువాడ : బాన్సువాడకు మంగళవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రానున్నారు. పట్టణంలోని భారత్ గార్డెన్‌లో నిర్వహించే పార్టీ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో వారు పాల్గొంటారని బీఆర్‌ఎస్ పట్టణ నాయకులు తెలిపారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు.
సబ్‌స్టేషన్‌లో
వీసీబీ ప్రారంభం
లింగంపేట: అయిలాపూర్‌లోని సబ్ స్టేషన్ లో వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్(వీసీబీ) ఫీ డర్‌ను సోమవారం ఎస్‌ఈ శ్రవణ్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీడర్ బ్రేకర్ ద్వారా అయిలాపూర్ గ్రామానికి 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి డీఈ విజయసారథి, ఏడీఈ మల్లేశం, ఎల్‌ఎం మోతీలాల్, ఏఎల్‌ఎంలు మల్లయ్య, ఆదిరెడ్డి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
జింక పిల్ల లభ్యం
రుద్రూర్: పోతంగల్ మండలం కల్లూర్ గ్రా మ శివారులో సోమవారం రైతులకు జింక పిల్ల కనిపించింది. దానిని వారు అటవీశాఖ సిబ్బందికి అప్పగించారు. అధికారులు వర్ని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించి చికిత్స చేయించారు.

కేంద్రీయ విద్యాలయం కోసం ఉన్నత పాఠశాల పరిశీలన

కేంద్రీయ విద్యాలయం కోసం ఉన్నత పాఠశాల పరిశీలన