
గ్రామాలను అభివృద్ధి వైపు నడిపించాలి
నిజాంసాగర్(జుక్కల్): స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు సేవా కార్యక్రమాలతో గ్రామాలను అభివృద్ధి వైపు నడిపించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. సోమవారం మహమ్మద్ నగర్ మండలం గాలీపూర్ గ్రామంలో జీవీఆర్ ట్రస్టును ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. సేవా కార్యక్రమాలు ఎంత చేశామని కాకుండా గ్రామాల్లో మార్పు కన్పించాలన్నారు. గాలీపూర్ గ్రామాన్ని దత్తత తీసుకొని ఏడాదిలో అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. అంబేడ్కర్‌ను స్ఫూర్తిగా తీసుకోని ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో జీవీఆర్ ట్రస్టు నిర్వహకుడు శ్రీధర్ రెడ్డి, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్‌కుమార్‌పటేల్, మహమ్మద్‌నగర్, నిజాంసాగర్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, ఏలే.మల్లికార్జున్, నాయకులు రమేష్‌యాదవ్, లోక్యానాయక్, సవాయ్‌సింగ్, ఆకాష్, సంతోష్‌రాథోడ్, హన్మండ్లు, తాటిపల్లి సరస్వతి తదితరులున్నారు.
నాయక్‌పోడ్ సర్టిఫికెట్లు ఇప్పించాలని వినతి
తమకు ఎస్టీ కులధ్రువీకరణ పత్రాలు ఇప్పించాలని సోమవారం గాలీపూర్ గ్రామంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావును ఆదివాసి నాయక్‌పోడ్ కులస్తులు కోరారు. మూడు నెలల నుంచి మహమ్మద్ నగర్ మండల తహసీల్దార్ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదన్నారు. ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలుు లేకపోవడంతో రాజీవ్ యువవికాస్ రుణాలతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు దూరం అవుతున్నామని వారు ఎమ్మెల్యేను కోరారు. ఈ విషయమై ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు జిల్లా అడిషనల్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి సమస్యను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు.
సేవా కార్యక్రమాలతో
మార్పు తీసుకురావాలి
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు