
కల్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ
భిక్కనూరు: కుల సంఘాలను అభివృద్ధి చేస్తామని బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పెద్దమల్లారెడ్డిలో ఎమ్మెల్యే సొంత నిధులతో చేపట్టిన ముదిరాజ్ సంఘం కల్యాణ మండపం నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఎమ్మెల్యే ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు.కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు రమేష్, గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు లింగం, ప్రతినిధులు యాదగిరి, నరసింహులు, స్వామి, శంకర్, రాజు పాల్గొన్నారు.