
భూభారతితో భూసమస్యలకు చెక్
‘ఇందిరమ్మ’కు ప్రత్యేకాధికారులు..
‘జల సంరక్షణ చర్యలు చేపట్టాలి’
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘‘భూముల సమస్యలకు శాశ్వత పరి ష్కారం చూపేందుకు ప్రభుత్వం భూ భారతి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో నాలు గు మండలాలను ఏర్పాటు చేయగా అందులో మన లింగంపేట కూడా ఉంది. ముందుగా లింగంపేట మండలంలోని 23 రెవె న్యూ గ్రామాల్లో భూభారతిపై ప్రజలకు అవగాహన క ల్పిస్తాం. వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఆ యా సమస్యలను పరిష్కరిస్తాం. భూసరిహద్దులు నిర్ణయించి నక్షతో కూడిన భూధార్ కార్డును జారీ చేస్తాం’’ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. జిల్లాలో భూభారతి అమలు, తాగునీటి సమస్య, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై మాట్లాడారు. ఆ వివరాలు..
భూభారతి అమలు కోసం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న లింగంపేట మండలంలోని 23 రెవెన్యూ గ్రామాల్లో పని మొదలవుతుంది. ఈనెల 17 నుంచి 30 వరకు రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆయా గ్రామాలకు వెళ్లి ప్ర జలకు భూ భారతి గురించి అవగాహన కల్పిస్తారు. తహసీల్దార్, డి ప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్, ఆర్‌ఐ, జూనియర్ అసిస్టెంట్‌లు రెండుమూడు బృందాలుగా విడిపోయి రోజూ రెండు, మూడు గ్రామాల్లో జరిగే సభల్లో పాల్గొంటారు. భూ సమస్యలపై ప్రజలనుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
అన్ని మండలాల్లో అవగాహన శిబిరాలు..
జిల్లాలోని 25 మండల కేంద్రాల్లో ఈనెల 17 నుంచి 30 వరకు భూ భారతిపై అవగాహన సభలు నిర్వ హిస్తాం. అన్ని కార్యక్రమాలలో నేను పాల్గొంటాను. అయితే పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికై న లింగంపేట మండలంలో మాత్రమే తొలుత దరఖాస్తులు స్వీకరిస్తాం. మిగతా మండలాల్లో భూభారతిపై అవగాహన మాత్రమే కల్పిస్తాం. భూ భారతి పోర్టల్‌లో రికార్డులన్నీ నమోదయ్యేదాకా ధరణి పోర్టల్ ద్వారా పనులు కొనసాగుతాయి.
మ్యాపింగ్ అయ్యాక భూధార్...
భూభారతిపై అవగాహన కల్పించాక.. ప్రజలనుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం. వాటిని పరిష్కరించిన తర్వాత భూముల సర్వే చేసి మ్యాపింగ్ చేస్తాం. అనంతరం భూధార్ కార్డు జారీ చేస్తాం. భూభారతిలో రైతులు తమ సమస్యలకు సంబంధించి తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలపై ఆర్డీవోకు, ఆర్డీవో ఇచ్చిన వాటికి కలెక్టర్‌కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కలెక్టర్ ఇచ్చిన వాటిపై ల్యాండ్ ట్రిబ్యునల్‌కు వెళ్లవచ్చు.
ధాన్యం కొనుగోళ్లు షురూ...
జిల్లాలో 446 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందులో 183 కేంద్రాలను మహిళా సంఘాలకు కేటాయించాం. ఇప్పటికే 426 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 15 వేల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేసి మిల్లులకు పంపించాం. అకాల వర్షాల నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేశాం. వడ్లు నానకుండా అవసరమైన టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాం. కొనుగోలు కేంద్రాలకు 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావచ్చని అంచనా వేశాం. మే నెలాఖరునాటికి కొనుగోళ్లను పూర్తి చేస్తాం.
తాగునీటి ఎద్దడి తలెత్తకుండా..
వేసవి నేపథ్యంలో నీటి ఎద్దడి నివారణకు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నాం. తాజాగా రూ. కోటి మంజూరయ్యాయి. నీటి సమస్య తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ నిధులను పంచాయతీలకు కేటాయిస్తాం. వాటిని మోటార్లు, పైప్‌లైన్‌ల మరమ్మతులు, నీటి సరఫరా, ఇతర పనులకు వినియోగిస్తాం.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం గురువారం వరకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తాం. కామారెడ్డి నియోజకవర్గానికి స్థానిక ఆర్డీవో, బాన్సువాడకు స బ్ కలెక్టర్, ఎల్లారెడ్డికి ఆర్డీవో, జుక్కల్‌కు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ను ప్రత్యేకాధికారులుగా నియమించాం. లబ్ధిదారులఎంపికలో అత్యంత నిరుపేద లు, వితంతువులువంటి వారికి ప్రాధాన్యతనిస్తాం. మండలాల్లో ఎంపీడీవోలు, ఎంపీవోలతో బృందాల ను ఏర్పాటు చేసి గ్రామాల వారీగా లబ్ధిదారుల జా బితాలు రూపొందిస్తాం. వచ్చేనెల 2 వరకు అర్హుల జాబితాలను ప్రదర్శిస్తాం. ఇంటి స్థలం లేని పేదలకు అందుబాటులో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయిస్తాం. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో 350 ఇళ్లు గ్రౌండ్ అవగా, 50 ఇళ్లు బేస్‌మెంట్ లెవల్‌కు చేరాయి.
పైలట్ ప్రాజెక్టు మండలంలో సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తాం
మిగతా మండలాల్లో రేపటినుంచి అవగాహన శిబిరాలు
పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ
తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం : జల సంరక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. భూగర్భ జలాల సంరక్షణపై కలెక్టరేట్‌లో మంగళవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయన్నారు. భూగర్భ జలాల సంరక్షణకోసం ఉపాధి హామీ పనుల కింద సోక్ పిట్, ఫాంపాండ్స్, కాంటూరు కందకాలు వంటివి నిర్మించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, భూగర్భ జల శాఖ ఏడీ సతీష్ యాదవ్, డీఆర్డీవో సురేందర్, డీఏవో తిరుమల ప్రసాద్, ఉద్యాన శాఖ అధికారి జ్యోతి, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

భూభారతితో భూసమస్యలకు చెక్

భూభారతితో భూసమస్యలకు చెక్