
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఆర్మూర్ టౌన్: ఆర్మూర్ పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద మంగళవారం సాయంత్రం లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జిరాయత్‌నగర్‌లో నివాసముండే ఒడ్డె గంగాధర్(55) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం పని నిమిత్తం ఎక్సెల్ బైక్‌పై వెళ్తున్న గంగాధర్‌ను క్లాక్ టవర్ వద్ద రెడీమిక్స్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో గంగాధర్ అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ధాన్యం లారీ ఢీకొని మరొకరు..
బోధన్‌టౌన్(బోధన్): బోధన్ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని లంగ్డాపూర్ బ్రిడ్జి వద్ద సోమవారం రాత్రి ధాన్యం లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మోస్రా మండలంలోని గోవూర్ గ్రామానికి చెందిన రాజాగౌడ్, లాలూ ద్విచక్ర వాహనంపై పని నిమి త్తం కందకుర్తికి వెళ్లి పెగడాపల్లి మీదుగా బోధన్‌కు తిరిగి వస్తున్నారు. బోధన్ నుంచి పెగడాపల్లి వైపు ధాన్యం లోడ్‌తో వెళ్తున్న లారీ లంగ్డాపూర్ బ్రిడ్జి వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న లాలూ(43)కు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందగా, రాజాగౌడ్‌కు గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని లా లూ మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీని అదుపులోకి తీసుకొని, మృతుడి భార్య ఎల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.