
సీఐపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు ఫిర్యాదు
లింగంపేట(ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డి సీఐపై మంగళవారం దళిత నాయకులు హైదరాబాదు నాంపల్లిలోని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఫిర్యాదు చేశారు. అంబేడ్కర్ జయంతి రోజున లింగంపేటలో దళిత నాయకుడిని అర్ధనగ్నంగా పోలీసులు ఈడ్చుకెళ్లి అరెస్టు చేసిన ఘటనపై ఎల్లారెడ్డి సీఐ రవీందర్‌నాయక్‌తో పాటు సంబందిత పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా చైర్మన్ వెంటనే కామారెడ్డి ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే సురేందర్, ముదాం సాయిలు, జిల్లా అధ్యక్షుడు గంగారాం, సంగమేశ్వర్, నెల్లూరి గంగారాం, భూపతి, రాజు, జిల్లా, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
కామారెడ్డి ఎస్పీకి..
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో జరిగిన ఘటనలో ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్‌పై చర్యలు తీసుకోవాలని దళిత సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు మంగళవారం జిల్లా ఎస్పీ రాజేష్‌చంద్రకు ఫిర్యాదు చేశారు. అంబేడ్కర్ సంఘ ప్రతినిధులు ముదాం సాయిలు, సంఘమేశ్వర్, గంగారాం, భూపతి, లెగ్గల రాజు, ఆశయ్య, అల్లూరి, మన్నె శ్రీనివాస్, సాయిలు, క్రాంతి, చెన్నం సాయిలు, భూషణం తదితరులు పాల్గొన్నారు.

సీఐపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు ఫిర్యాదు