
ధాన్యం తూకంలో మోసం
● రైతుల ఆందోళన ● సరి చేస్తామన్న నిర్వాహకులు
కామారెడ్డి రూరల్ : శాబ్దిపూర్ కొనుగోలు కేంద్రంలో బస్తాకు రెండు కిలోలు ఎక్కువగా తూకం వేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. నిబంధనల ప్రకారం ధాన్యం బస్తా బరువు 40.600 కిలోలు ఉండాల్సి ఉండగా తరుగు కోసం 42.500 కిలోలు తూకం వేయడానికి ఒప్పుకున్నామన్నారు. అయినా సెంటర్ నిర్వాహకులు అదనంగా రెండు కిలోలు జోకుతున్నారని ఆరోపించారు. రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న పీఏసీఎస్ సెక్రెటరీ కొనుగోలు కేంద్రం వద్దకు వచ్చి కాంటాను సరి చేస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు.