
అక్రమ నియామకాలపై కలెక్టర్ స్పందించాలి
కామారెడ్డి టౌన్: మెడికల్ కళాశాలలో ఇటీవల జరిగిన ఔట్ సోర్కింగ్ ఉద్యోగ నియామకాలలో అక్రమాలు జరిగాయని తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా మెరిట్ ఆధారంగా తీసుకోకుండా కామారెడ్డి మ్యాన్ పవర్ ఏజెన్సీ అక్రమ నియామకాలకు పాల్పడినట్లు తెలిపారు. రూ. కోటికిపైగా కుంభకోణం జరిగిందని ఆరోపించారు. తక్షణమే కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ నియమకాలు రద్దు చేయకపోతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ, బీసీ విద్యార్థి సంఘాల జిల్లా అధ్యక్షుడు అరుణ్‌కుమార్, నాగరాజు, బీవీయం రాష్ట్ర కార్యదర్శి విఠల్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కన్వీనర్ శివ, నాయకులు అజయ్, రాహుల్, మనోజ్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.