
నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక విషయంలో నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ సూచించారు. నాగిరెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో శనివారం పలుగ్రామాల పంచాయతీల కార్యదర్శులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నిరుపేదలకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పారు. దీంతోపాటు రేషన్‌కార్డుల సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. అర్హులకు మాత్రమే కార్డులు అందేలా సర్వే చేయాలన్నారు. డీపీవో మురళీ, ఎంపీడీవో ప్రభాకరచారి తదితరులు పాల్గొన్నారు.
11కేవీ లైన్ ఏబీ స్విచ్‌ల ఏర్పాటు
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండలం సబ్ డివిజన్ పరిధిలోని శెట్పల్లిసంగారెడ్డి శివారులో శనివారం 11కేవీ లైన్ ఏబీ స్విచ్‌లు బిగించినట్లు ట్రాన్స్‌కో ఏడీఈ మల్లేశం తెలిపారు. శెట్పల్లిసంగారెడ్డి పరిధిలో 24, లింగంపేటలో 10, గాంధారిలో 18, సర్వాపూర్‌లో 6, మొత్తం 58 ఏబీ స్విచ్‌లు రన్నింగ్‌లో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వీటి ద్వారా 11కేవీ లైన్‌లో ఏమైనా సమస్యలుంటే అదే భాగాన్ని ఓపెన్ చేసి మిగతా 11కేవీలకు సప్‌లై ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు. ఏఈలు హరీష్‌రావు, సాయినాథ్, సిబ్బంది పాల్గొన్నారు.
హోరాహోరీగా కుస్తీ పోటీలు
బాన్సువాడ రూరల్: మండలంలోని బోర్లం గ్రామంలో మత్తడి పోచమ్మ జాతర సందర్భంగా శనివారం స్థానిక జెడ్పీ హైస్కూల్ ఆవరణలో కుస్తీ పోటీలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన మల్లయోధులు హోరాహోరీగా తలపడ్డారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతానికి చెందిన మల్లయోధులు తమ కుస్తీలతో వీక్షకులను అలరించారు. నిర్వాహకులు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.బాన్సువాడ పోలీసులు, బందోబస్తు పర్యవేక్షించారు.
ప్రైవేటుకు దీటుగా విద్యా బోధన
భిక్కనూరు: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యాబోధన చేస్తాం...మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించండని లక్ష్మీదేవునిపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం రజిత అన్నారు. శనివారం గ్రామంలో ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయని, పుస్తకాలు కూడా ఉచితంగా అందజేస్తామన్నారు. మాజీ ఉపసర్పంచ్ పరమేశ్వర్‌రెడ్డి, రిటైర్టు ఉపాధ్యాయుడు రాంరెడ్డి, కాంప్లెక్సు హెచ్‌ఎం ప్రసూన, అంగన్‌వాడి టీచర్ సువర్ణ పాల్గొన్నారు.

నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలి

నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలి