
నేరాల నియంత్రణకు చర్యలు
వర్ని/రుద్రూర్: నేరాల నియంత్రణకు కఠినచర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైత న్య పేర్కొన్నారు. వర్ని, రుద్రూర్, కోటగిరి పోలీస్ స్టేషన్లను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసిప్షన్ సెంటర్, కంప్యూటర్ సిబ్బంది పని తీరును అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లో సౌకర్యా లు, సమస్యలపై ఆరా తీశారు. మత్తు పదార్థాలు, గంజాయి, గేమింగ్ యాప్స్, సైబర్ నేరాల బారినపడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఎస్సైలు సాయన్న, మహేశ్ ఉన్నారు.
రైతు మహోత్సవాన్ని విజయవంతం చేయాలి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 23 వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చేపట్టే రైతు మహోత్సవాన్ని విజయవంతం చేయాలని మండల వ్యవసాయాధికారి ప్రజాపతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని జీజీ కాలేజీ గ్రౌండ్‌లో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో రైతులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.