
పారదర్శకంగా ఎంపిక చేయాలి
పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడుతున్న కలెక్టర్ సంగ్వాన్
ఎల్లారెడ్డిరూరల్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. శనివారం ఆర్డీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిర మ్మ ఇళ్ల సర్వేను సక్రమంగా నిర్వహించాలని, అ నర్హులకు ఇళ్లను మంజూరు చేయరాదని ఆదేశించారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావాలన్నారు. ఆర్థికంగా వెనకబడిన వారికి స్వయం సహాయక సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణం మంజూరు చేయాలని సూచించా రు. రేషన్ కార్డుల సర్వే సైతం పారదర్శకంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్ట ర్లు విక్టర్, చందర్‌నాయక్, డీపీవో మురళి, డీఎల్‌పీవో సురేందర్, మున్సిపల్ కమిషనర్ మహేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
57 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం
జిల్లాలో ఇప్పటివరకు యాసంగికి సంబంధించి 57వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చే శామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శ నివారం ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయ న సందర్శించారు. నూతనంగా వచ్చిన ప్యాడీ క్లీనర్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన విలే కరులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూ డాలని అధికారులను ఆదేశించామన్నారు. కొ నుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు తరలించే పనులు జరుగుతున్నాయన్నారు. కాంటాలు ప్రారంభంకాని చోట కాంటాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించామన్నారు.