కామారెడ్డి క్రైం: కేసులలో దోషులకు శిక్ష పడే లా చూడాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివా రం నిర్వహించిన సమావేశంలో కోర్టు వి ధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరస్తులకు శిక్ష పడితే నే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఎఫ్ ఐఆర్ మొదలుకొని చార్జిషీట్, సాక్షులను ప్ర వేశపెట్టడం వరకు అన్ని రకాల కోర్టు విధుల ను పకడ్బందీగా నిర్వహించాలని సూచించా రు. సమావేశంలో ఏఎస్పీ నర్సింహారెడ్డి, అ ధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాడ్వాయి ఎస్సైపై సస్పెన్షన్ వేటు
కామారెడ్డి క్రైం: విధుల్లో నిర్లక్ష్యాన్ని కనబరిచినందుకు తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లుపై స స్పెన్షన్ వేటు పడింది. ఇటీవల ఎస్పీ రాజేశ్ చంద్ర తాడ్వాయి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చే శారు. ఆ సమయంలో ఎస్సై వెంకటేశ్వర్లు అందుబాటులో లేరు. ఎక్కడికి వెళ్లారన్న వి షయమై సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదు. అనంతరం ఎల్లారెడ్డిలో పర్యటించిన ఎస్పీ.. కామారెడ్డికి తిరిగి వస్తూ తాడ్వాయి పీఎస్‌ను మరోసారి సందర్శించారు. అప్పు డు కూడా ఎస్సై లేకపోవడంతో వాకబు చే యగా.. సీఐకిగాని, డీఎస్పీకి గాని సమాచా రం ఇవ్వకుండా స్థానికంగా అందుబాటులో లేరని తెలిసింది. సదరు ఎస్సై వ్యవహారంపై విచారణ జరపగా స్థానికంగా సరిగా అందుబాటులో ఉండరని తేలింది. దీంతో శాఖాపరమైన చర్యలకు ఎస్పీ ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో విధుల్లో నిర్లక్ష్యం కనబరిచిన ఎస్సైని సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ ఐ జీ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
వరిధాన్యం తూకాలు ప్రారంభం
నిజాంసాగర్: నిజాంసాగర్, మహమ్మద్‌నగర్ మండలాల్లోని మల్లూ ర్, మహమ్మద్‌నగర్ గ్రా మాల్లో శనివారం వరిధాన్యం తూకాలను ప్రా రంభించారు. ‘వడ్లు కొనేదెప్పుడో’ శీర్షికన శ నివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు.. వెంటనే కాంటాలకు చర్యలు తీసుకున్నారు. రెండు గ్రామా ల్లోని కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని కాంటా వేయించారు. మిగిలిన గ్రామాల్లో రెండు, మూడు రోజుల్లో తూకాలు ప్రారంభి స్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మహమ్మద్‌నగర్ మండల వ్యవసాయ శాఖ అధికారి నవ్య, సొసైటీ సీఈవోలు చింతరాములు సేట్, సాయిలు పాల్గొన్నారు.
350 ఎకరాల్లో నష్టం
బీబీపేట: మండల కేంద్రంతో పాటు యాడారం, మల్కాపూర్, శివారు రాంరెడ్డిపల్లి గ్రా మాల్లో శుక్రవారం రాత్రి కురిసిన వడగళ్ల వా నకు సుమారు 350 ఎకరాల్లో వరి, మామిడి తోటలకు నష్టం వాటిల్లిందని మండల వ్యవసాయ అధికారి నరేంద్ర తెలిపారు. అధికారులు శనివారం ఉదయం నుంచి ఆయా గ్రా మాల్లో పంటలను పరిశీలించారు. కోళ్ల ఫా రాల పైకప్పులు లేచిపోవడంతో పౌల్ట్రీ రైతు లూ నష్టపోయారన్నారు. ఏవో వెంట ఏఈ వో రాఘవేంద్ర తదితరులున్నారు.
‘మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి’
కామారెడ్డి క్రైం: యువత మత్తు పదార్థాలకు, కల్తీ కల్లుకు దూరంగా ఉండాలని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హన్మంతరావు సూచించారు. ఈ విషయమై జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కల్తీకల్లు, మత్తుపదార్థాల కారణంగా కలిగే దుష్ప్రభావాలపై శనివారం జిల్లావ్యాప్తంగా 22 మండలాల పరిఽధిలో 86 గ్రామాల్లో అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించామన్నారు. మత్తు పదార్థాలను రవాణా చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలను సరఫరా చేసినా, విక్రయించినా 1908 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతోపాటు, పారితోషికం అందిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
‘దోషులకు శిక్ష పడేలా చూడాలి’
‘దోషులకు శిక్ష పడేలా చూడాలి’