
అగ్ని ప్రమాదాల నివారణకు కృషి చేయాలి
ఖలీల్‌వాడి: అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీ పోతరాజు సాయిచైతన్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రంలో నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి సీపీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అగ్నిప్రమాదం సంభవిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యక్రమానికి హాజరైన పలు పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు సంభవించిన స్థానిక ప్రజలు మంటలను ఆర్పివేస్తే ఆస్తి, ప్రాణ నష్టం తక్కువగా ఉంటుందని అన్నారు. అనంతరం విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్లు పి.నర్సింగ్ రావు, మధుసూదన్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
సీపీ పోతరాజు సాయిచైతన్య