
చౌదరి చెరువు మరమ్మతులకు రూ.37లక్షలు మంజూరు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పొల్కంపేట చౌదరి చెరువు మరమ్మతులకు రూ. 37 లక్షలు మంజూరైనట్లు కాంగ్రెస్ పార్టీ మండల సమన్వయకర్త నాగరాజు తెలిపారు. చౌదరి చెరువు తూము గత నాలుగు సంవత్సరాల క్రితం భారీ వర్షానికి తెగిపోయి కొట్టుకుపోయినట్లు తెలిపారు. ఈ విషయాన్ని గ్రామ రైతులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి ఎస్‌డీఎఫ్ నిధుల నుంచి రూ.37 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి అశ్వక్, గ్రామ కమిటీ అధ్యక్షుడు అజయ్‌గౌడ్, శివ్వయ్య, శ్రీనివాస్, సంజీవరెడ్డి, కృష్ణమూర్తి, దాసరి శ్రీనివాస్, రమేశ్, సతీష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దమ్మ.. కరుణించమ్మా
మాచారెడ్డి: మండలంలోని లచ్చాపేటలో మంగళవారం పోచ
మ్మ, పెద్దమ్మ బోనాలను ఊరేగించారు. ముదిరాజులు ఇంటికో బోనం చొప్పున అలంకరించి అమ్మ వారికి సమర్పించారు. ఈసారి వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని పెద్దమ్మ తల్లిని వేడుకున్నారు.
ఉద్యోగ భద్రత కల్పించే వరకు సమ్మె
భిక్కనూరు: ఇచ్చిన హమీ మేరకు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల ఉద్యోగ భద్రత కల్పించేవరకు సమ్మెను కొనసాగిస్తామని కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యాక్షుడు నారాయణగుప్తా అన్నారు. మంగళవారం తెలంగాణ యునివర్సీటీ సౌత్ క్యాంపస్‌లో కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో 1100 మంది కాంట్రాక్లు అధ్యాపకులు ఉన్నారని వీరందరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకులు యాలాద్రి, సునిత, నరసయ్య,రమాదేవి, నిరంజన్, వైశాలి, సరిత, శ్రీకాంత్, దిలీప్‌లు పాల్గొన్నారు.