
మళ్లీ అట్టడుగునే..
బుధవారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 10లో u
● ఇంటర్ ఫస్టియర్‌లో
50.09 శాతం ఉత్తీర్ణత
● సెకండియర్‌లో 56.38 శాతం..
● ఫలితాల్లో బాలికలదే పైచేయి
కామారెడ్డి టౌన్: ఇంటర్ ఫలితాలలో జిల్లా విద్యార్థులు నిరాశ పరిచారు. దాదాపు సగం మందే ఉత్తీర్ణులయ్యారు. దీంతో ఫలితాల్లో కామారెడ్డి జిల్లా వరుసగా రెండో ఏడాదీ రాష్ట్రంలో అట్టడుగున ఉండిపోయింది. ఇంటర్మీయట్ బోర్డు మంగళవారం ఇంటర్ ఫలితాలను విడుదల చేసింది. ఫస్టియర్‌లో 50.09 శాతం, సెకండియర్‌లో 56.38 శాతం ఉత్తీర్ణులయ్యారు. షరా మామూలుగా ఫలితాల్లో ఈసా రి కూడా బాలికలదే పైచేయిగా నిలిచింది.
ఫస్టియర్ ఫలితాలు..
జిల్లాలో 8,740 మంది ఫస్టియర్ పరీక్షలు రాయగా 4,378 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 50.09గా నమోదైంది. ఇందులో బాలురు 4,053మంది పరీక్షలు రాయగా 1,496 ఉత్తీర్ణులయ్యారు. 36.91 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికల్లో 4,687 మందికి 2,882 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 61.49గా ఉంది.
జనరల్ గ్రూప్స్‌లో 6,828 మంది పరీక్షలు రాయ గా 3,343మంది(48.96 శాతం) పాసయ్యారు. వొకేషనల్ విభాగంలో 1,912 మందికిగాను 1,035 మంది(54.13 శాతం) పాసయ్యారు.
సెకండియర్ ఫలితాలు..
జిల్లాలో 7,722 మంది విద్యార్థులు సెకండియర్ ప రీక్షలు రాయగా 4,354 మంది పాసయ్యారు. 56.38 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలు రు 3,580 మంది పరీక్షలు రాయగా 1,569 (43.83 శాతం) పాసయ్యారు. బాలికల్లో 4,141 మందికిగా ను 2,785 (67.24 శాతం) ఉత్తీర్ణులయ్యారు. జనరల్ విభాగంలో 6,485 మంది పరీక్షలు రాయగా 3,562 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 54.93గా నమోదైంది. వొకేషనల్ విభాగంలో 1,237 మందికిగాను 792 మంది పాసయ్యారు. 64.03 శాతం ఉత్తీర్ణులయ్యారు.
న్యూస్‌రీల్
అందరూ ఫెయిల్
నాగిరెడ్డిపేట: ఈ ఏడాది నూతనంగా ప్రారంభమైన నాగిరెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫలితాలు నిరాశ పరిచాయి. 45 మంది మొదటి సంవత్సరం పరీక్షలు రాయగా అందరూ అనుత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరైన ఒక విద్యార్థి సైతం ఫెయిల్ అయ్యారు.
ఇంటర్ ఫలితాల్లో జిల్లా వరుసగా రెండో ఏడాది కూడా చిట్టచివరి స్థానంలో నిలిచింది. 2023 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 13వ స్థానంలో ఉన్న జిల్లా.. 2024 సంవత్సరానికి వచ్చేసరికి 35 వ స్థానానికి పడిపోయింది. ఈసారి కూడా చివరిస్థానంలోనే నిలవడం గమనార్హం.

మళ్లీ అట్టడుగునే..