
పట్టా భూములను రికార్డుల్లో నుంచి తొలగించారు
పట్టా భూములను రెవెన్యూ రికార్డుల్లో నుంచి తొలగించారని గాంధారి మండలం బొప్పాజీవాడి గ్రామానికి చెందిన రైతులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. గ్రామానికి సమీపంలో ఉన్న చింతల చెరువు శిఖంలో దాదాపు 20 మంది రైతులకు సంబ ంధించిన 15.15 ఎకరాల స్వంత పట్టా భూములు ఉండేవన్నారు. చెరువులో ప్రతి ఏటా నీరు తగ్గాక యాసంగి పంటలు సాగు చేసుకునేవారమని వెల్లడించారు. గతేడాది గ్రామంలో పర్యటించిన అధికారులు చెరువు శిఖం సర్వే నెంబర్ 14,15 లను, మా పట్టా భూములను రికార్డుల్లో నుంచి తొలగించారన్నారు. రికార్డుల్లో మాభూములను తిరిగి నమోదు చేయాలని ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.