బాలరక్ష భవన్‌లో చిన్నారి (ఫైల్)
కరీంనగర్: పది రోజుల క్రితం సైదాపూర్ మండలం నుంచి గుర్తు తెలియని పాపను ఎస్సై ఆరోగ్యం ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని బాలరక్ష భవన్‌లో అప్పగించిన విషయం తెలిసిందే. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా సకినేటి గ్రామం నుంచి రేపల్లె పద్మతో పాటు శ్రీకాకుళం జిల్లా పొన్నాడ గ్రామం నుంచి దోరాకపీతల రవిచంద్ర దంపతులు బాలిక తమ పాపేనని కరీంనగర్‌లోని బాలభవన్‌కు చేరుకున్నారు. బాలభవన్ వద్ద కాసేపు తమపాప అంటే తమపాప అంటూ అధికారులతో ఆధారాలు చూపించే ప్రయత్నాలు చేశారు. అయితే సీడబ్ల్యూసీ చైర్మన్ ధనలక్ష్మితో పాటు సంబంధిత అధికారులు జోక్యం చేసుకోని మూడేళ్ల వయస్సులో తప్పిపోయిన అమ్మాయికి తొమ్మిదేళ్లు వచ్చాయని ఇన్నాళ్లు ఎక్కడ ఉన్న విషయంతో పాటు ఎలా తప్పిపోయిందో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కాపీలను చూపాలని తేల్చి చెప్పడంతో అవేమి లేవని అమ్మాయి తమ బిడ్డేనంటూ రెండుు కుటుంబాలు అధికారులను వేడుకున్నారు. దీంతో బాలరక్ష భవన్ అధికారులు ఆధారాలు ఉంటేనే అప్పగిస్తామని వెల్లడించారు. ‘సైదాపూర్ మండలం ఎగ్లాస్‌పూర్ గ్రామానికి చెందిన వారు వాట్సాప్ గ్రూప్‌ల్లో గుర్తు తెలియని అమ్మాయిని గురించి పోస్టు చేశారు. సైదాపూర్ ఎస్సై సెల్‌నెంబర్‌ను జోడించడంతో పాప విషయం వెలుగులోకి వచ్చింది. పది రోజుల క్రితం బాలరక్ష భవన్‌లో అప్పగించారు. తప్పిపోయిన బాలికను పోల్చుకోవడం రెండు కుటుంబాలకు సరిపోవడం లేదు. పూర్తిస్థాయి ఆధారాలు, ఎఫ్‌ఐఆర్ కాపీ, పుట్టుమచ్చలు ఇలాంటివి ఆధారాలు చూపామని అడిగాం. సమాధానం లేదు. రెండు కుటుంబాల వారికి అవసరమైతే డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి, అసలైన తల్లిదండ్రులకు ప్రభుత్వ నిబంధనల మేరకు అప్పగిస్తాం’. అని సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి వివరించారు.
సైదాపూర్ ఘటనలో చిన్నారికోసం పలువురి రాక
సరైన ఆధారాలు లేకపోవడంతో అప్పగింతకు అధికారుల నిరాకరణ
Comments
Please login to add a commentAdd a comment