uమొదటి పేజీ తరువాయి
చేపడుతోంది. మైనార్టీ సొసైటీలోని పాఠశాలలు మినహా మిగిలిన నాలుగు సొసైటీల్లోని 643 పాఠశాలల్లో ఐదోతరగతిలో 51,924 సీట్లు ఉన్నా యి. వీటిలో ఐదోతరగతి ప్రవేశాలకు గతేడాది డిసెంబర్ 21 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 80 వేలలోపే దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాదితో పోల్చితే ఇవి దాదాపు 40 వేలు తక్కువ. ఈ నెల 23వ తేదీన అర్హత పరీక్ష నిర్వహించేందుకు ఎస్సీ గురుకుల సొసైటీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం నమోదైన దరఖాస్తుల ప్రకారం ఒక్క సీటు కోసం సగటున 1.6 మంది పోటీ పడుతున్నారు. గురుకుల పాఠశాల ప్రవేశం కోసం గతంలో విపరీతమైన డిమాండ్ ఉండేది. ఒక్కో సీటు కోసం సగటున నలుగురు విద్యార్థులు పోటీపడేవారు. గత ఏడాది కాలంగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు భారీగా పెరగటమే డిమాండ్ తగ్గటానికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
సంవత్సరాలవారీగా దాదాపుగా సీట్లు, దరఖాస్తులు
సంవత్సరం మొత్తం సీట్లు దరఖాస్తులు
2020–21 48,000 1,68,000
2022–23 48,000 1,50,000
2023–24 48,000 1,32,000
2024–25 51,000 1,20,000
2025–26 51,000 80,000
సొసైటీల వారీగా పాఠశాలలు,
ఐదో తరగతిలో సీట్లు ఇలా..
సొసైటీ స్కూళ్లు సీట్లు
ఎస్సీ 232 18,560
ఎస్టీ 82 6,560
బీసీ 294 23,680
జనరల్ 35 3,124
మొత్తం 643 51,924
Comments
Please login to add a commentAdd a comment