‘సహకార’ సభ్యులకు ప్రమాదబీమా, డివిడెంట్‌ | - | Sakshi
Sakshi News home page

‘సహకార’ సభ్యులకు ప్రమాదబీమా, డివిడెంట్‌

Mar 17 2025 11:09 AM | Updated on Mar 17 2025 11:09 AM

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కరీంనగర్‌ సహకార అర్బన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ మహాజన సభ రెవె న్యూ గార్డెన్‌లో చైర్మన్‌ గడ్డం విలాస్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యులు పలు సూచనలు చేశారు. సభ్యులు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే రూ.2లక్షల ఇన్సూరెన్స్‌, రెండేళ్ల డివిడెంట్‌ ఇచ్చేందుకు, బ్యాంకు పరిధిని 20 కిలోమీటర్ల వరకు పెంచు తూ తీర్మానాలు చేశారు. హుస్నాబాద్‌, చొప్పదండిలో బ్రాంచ్‌లు ఏర్పాటు చేసేందుకు ఆమోదించారు. సమావేశంలో చైర్మన్‌ గడ్డం విలాస్‌ రెడ్డి,మడుపుమోహన్‌, ముక్క భాస్కర్‌, బొమ్మరాతి సాయికృష్ణ, క్రాంతి, రేగొండ సందీప్‌, మూలలక్ష్మీ రవీందర్‌, విద్యాసాగర్‌, లక్ష్మణ్‌, రాజు, మహమ్మద్‌ సమయుద్దిన్‌, మంగి రవీందర్‌, నాగుల సతీశ్‌, మార్కారాజు, గంజి అంజయ్య, బ్యాంకు ముఖ్య నిర్వహణ అధికారి నునుగొండ శ్రీనివాస్‌, జగిత్యాల బ్రాంచ్‌ మేనేజర్‌ ఎలుక సుధాకర్‌ పాల్గొన్నారు.

వన్‌నేషన్‌, వన్‌ ఎలక్షన్‌తో సమూల మార్పు

కరీంనగర్‌ టౌన్‌: వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌(జమిలి)తో ఎన్నికల నిర్వహణలో సమూల మార్పులు వస్తాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. వన్‌నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ వర్క్‌షాప్‌ ఆదివారం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రోగ్రాం కన్వీనర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు సాయిని మల్లేశం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే సమయం ఆదా అవుతుందన్నారు. పోలింగ్‌శాతం కూడా పెరుగుతుందన్నారు. మోడీ ప్రభుత్వం జమిలి ఎన్నికలపై ఆ లోచన చేస్తోందన్నారు. ఈ ప్రతిపాదన చట్టంగా మారితే, లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయని, జమిలి ఎన్నికలపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. మాడ వెంకటరెడ్డి, మాజీ మేయర్లు శంకర్‌, సునీల్‌రావు, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్‌ పాల్గొన్నారు.

‘వైరాగ్యం’కు విశ్వ విభూషణ్‌ పురస్కారం అందజేత

కరీంనగర్‌ కల్చరల్‌: విశ్వవిఖ్యాత ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ అకాడమీ మంథని, కేఎన్‌డీ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఖమ్మం ఆధ్వర్యంలో కరీంనగర్‌ చెందిన కవి, రచయిత వైరాగ్యం ప్రభాకర్‌కు విశ్వవిభూషణ్‌ అవార్డు ప్రదానం చేశారు. హైదరాబాద్‌లో నాని త్యాగరాయ గానసభ హాల్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకుడు ఎస్వీఆర్‌ వెంకటేశ్‌, చీమల కోటేశ్వరి చేతులు మీదుగా అవార్డు అందుకున్నా రు. కరీంనగర్‌కు చెందిన కవి గంప ఉమాపతిని చతుర్ముఖ సింహ అవార్డుతో సత్కరించారు.

సీఎం మాట నిలబెట్టుకోవాలి

కరీంనగర్‌: రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకుండా ఎస్సీ వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చే యడం దారుణమని ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్‌ అన్నారు. కలెక్టరేట్‌ ఎదుట ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్ష ఆదివారం 7వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా అనిల్‌ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఇచ్చిన తీర్పును స్వాగతించిన ముఖ్యమంత్రి ప్రతీ ఉద్యోగ నో టిఫికేషన్‌కు ఎస్సీ వర్గీకరణ వర్తింపజేస్తామని అసెంబ్లీలో హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఆ హామీని అమల్లోకి తీసుకురాకుండా టీచర్‌ ఉద్యోగాలను భర్తీ చేసి మాదిగలకు అన్యాయం చేశారన్నారు. 17వ తేదీన అసెంబ్లీలో చట్టం చేస్తామని చెబుతూనే, వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తూ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాడని మండిపడ్డారు. అంజిబాబు, వరలక్ష్మి, రాజన్న, హన్మయ్య, బాబు, సంపత్‌, మొగిలి, లక్ష్మణ్‌, విజయ్‌, రఘు, రమేశ్‌, మహేశ్‌ పాల్గొన్నారు.

‘సహకార’ సభ్యులకు ప్రమాదబీమా, డివిడెంట్‌ 
1
1/3

‘సహకార’ సభ్యులకు ప్రమాదబీమా, డివిడెంట్‌

‘సహకార’ సభ్యులకు ప్రమాదబీమా, డివిడెంట్‌ 
2
2/3

‘సహకార’ సభ్యులకు ప్రమాదబీమా, డివిడెంట్‌

‘సహకార’ సభ్యులకు ప్రమాదబీమా, డివిడెంట్‌ 
3
3/3

‘సహకార’ సభ్యులకు ప్రమాదబీమా, డివిడెంట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement