వేంపేటలో వీధికుక్కల వీరంగం
మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలం వేంపేటలో వీధికుక్కలు వీరంగం సృష్టించాయి. గొర్రెలు, మేకల మందపై దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో 16 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. మరో ఎనిమిది మేకలు గాయాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామానికి చెందిన రాచర్ల అంజయ్య సోమవారం మేతకు తీసుకెళ్లేందుకు కొట్టం వద్దకు వెళ్లాడు. అప్పటికే కుక్కలు దాడి చేసి గొర్రెలను చంపేశాయి. ఈ ఘటనలో సుమారు రూ.2లక్షల వరకు నష్టం జరిగిందని బాధితుడు తెలిపాడు. మెట్‌పల్లి మండల పశువైద్యాధికారి మనీషా, ఆర్‌ఐ కాంతయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్‌రెడ్డి మృతి చెందిన గొర్రెలను పరిశీలించారు. నష్టపరిహారం వచ్చేలా చూస్తామన్నారు.
16 గొర్రెలు మృతి