ఇఫ్తార్‌కు ఏర్పాట్లు చేసి వెళ్తుండగా..
శంకరపట్నం(మానకొండూర్): రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించే ఇఫ్తార్ విందుకు తండ్రికొడుకులు ఏర్పాట్లు చేశారు. అంతలోనే జరిగిన రోడ్డుప్రమాదంలో అసులువుబాసారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రా మంలో ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల క థనం ప్రకారం.. మండలంలోని మక్త గ్రామానికి చెందిన తండ్రికొడుకులు షేక్ అజీమ్ (35), షేక్ రె హమాన్ (10) శుక్రవారం కేశవపట్నంలో ఇఫ్తార్ విందుకు ఏర్పాట్లు చేసి ఇంటికి బైక్‌పై వెళ్తున్నారు. అదే సమయంలో మండలంలోని మెట్‌పల్లి గ్రామానికి చెందిన మందాడి శ్రీనివాస్‌రెడ్డి, ఇజ్జిగిరి హరీశ్ కూడా కేశవపట్నం నుంచి బైక్‌పై వెళ్తుండగా వరంగ ల్ నుంచి కరీంనగర్ వస్తున్న లారీ కేశవపట్నం బ్రిడ్జి సమీపంలో ఇరువురి బైక్‌లను ఢీకొంది. ఈ ప్రమాదంలో అజీమ్, రెహమాన్ తీవ్రంగా గాయపడ్డారు. మందాడి శ్రీనివాస్‌రెడ్డికి తీవ్ర, హరీశ్‌కు స్వల్పగాయాలయ్యాయి. కేశవపట్నం ఎస్సై రవి, సిబ్బంది 108వాహనంలో క్షతగాత్రులను హుజూరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో అజీమ్, రెహమాన్‌ను పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన లారీ ఆగకుండా వెళ్లడంతో పోలీసులు, స్థానికులు వంకాయగూడెంలో పట్టుకున్నారు. ప్రమాద స్థలాన్ని ఏసీపీ శ్రీనివాస్‌జీ, హుజూరాబాద్ రూరల్ సీఐ వెంకటి పరిశీలించారు. ఇఫ్తార్ విందులో పాల్గొనాల్సిన తండ్రికొడుకుల దుర్మరణం స్థానికులను కలచివేసింది.
రెండు బైక్‌లను ఢీకొన్న లారీ
తండ్రికొడుకులు మృతి
మరో ఇద్దరికి తీవ్రగాయాలు
ఇఫ్తార్‌కు ఏర్పాట్లు చేసి వెళ్తుండగా..
ఇఫ్తార్‌కు ఏర్పాట్లు చేసి వెళ్తుండగా..