రైల్వేస్టేషన్ నిర్మించాలి
ప్రస్తుతం 1.78 కి.మీ. పొడవైన ఈ మార్గం సింగిల్ లైన్ త్వరలో డబుల్ లైన్ కానుంది. ఇప్పటికే రెండో లైన్ కోసం రైల్వేశాఖ టెండర్లు పిలిచింది. త్వరలోనే ఈ లైన్ పనులు కూడా పూర్తయి అందుబాటులోకి రానుంది. కోవిడ్ సమయంలో పెద్దపల్లి బైపాస్ రైల్వేలైన్ పనులు మొదలయ్యాయి. చీకురాయి పరిసర గ్రామాల్లో భూసేకరణ కోసం రైల్వే అధికారులు గ్రామసభలు నిర్వహించి రెండేళ్ల క్రితం పనులు ప్రారంభించగా ఇప్పటికీ పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ లైన్ వద్ద కేవలం క్యాబిన్ మాత్రమే ఉంది. త్వరలో ప్రయాణికులకు వీలుగా రైల్వేస్టేషన్ కూడా నిర్మించే ఆలోచనలో అధికారులు ఉన్నారు.
చీకురాయి సమీపంలోని రైల్వేబైపాస్ ప్రాంతంలో పెద్దపల్లిటౌన్ రైల్వేస్టేషన్ నిర్మించాలి. దీంతో ఇతర ప్రాంతాల నుంచి పెద్దపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. రైల్వే బైపాస్ అందుబాటులోకి వస్తే కరీంనగర్, పెద్దపల్లి ప్రాంతాల నుంచి ఇటు నిజామాబాద్.. అటు ముంబయి తదితర ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. – కమల్‌కిశోర్ శారడ,
చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పెద్దపల్లి
త్వరలో డబుల్ లైన్..!