లాభాల బాటలో ఆర్‌ఎఫ్‌సీఎల్
ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్‌ఎఫ్‌సీఎల్) కర్మాగారం లాభాల బాటలో పయనిస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత 12.7 లక్షల మెట్రిక్ టన్నులకు 11,94,921.17 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసి సుమారు రూ.510 ఆదాయం సమకూర్చుకుంది. ప్లాంట్ సామర్థ్యం రోజూ 3,850 మెట్రిక్ టన్నుల యూరియా, 2,200 మెట్రిక్ టన్నుల అమ్మోనియా ఉత్పత్తి చేస్తోంది.
ఏడు రాష్ట్రాలకు సరఫరా..
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉత్పత్తి చేసిన యూరియాను తెలంగాణతోపాటు 7 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. తెలంగాణకు 4,68,954.76 మెట్రిక్ టన్నులు, ఆంధ్రప్రదేశ్‌కు 1,78,363.39 మెట్రిక్ టన్నులు, కర్ణాటకకు 1,91,288.07 మెట్రిక్ టన్నులు, మహారాష్ట్రకు 82,986.39 మెట్రిక్ టన్నులు, ఛత్తీస్‌గఢ్‌కు 60,640.38 మెట్రిక్ టన్నులు, తమిళనాడుకు 1,01,520.99మెట్రిక్ టన్నులు, మధ్యప్రదేశ్‌కు 1,11,167.19 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశారు.
లక్ష్యానికి దూరంగా ఉన్నా..
ఆర్‌ఎఫ్‌సీఎల్ 2024–25 ఆర్థిక సంవత్సరంలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేయాల్సి ఉంది. కానీ, 11,94,921.17 మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేశారు. కర్మాగారంలో నెలకొన్న సాంకేతిక సమస్యలతో దాదాపు 75,078.83 మెట్రిక్ టన్నుల యూరియా తక్కువగా ఉత్పత్తి చేశారు. ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం చేరుకోలేకపోయినా.. లాభాలు ఆర్జిస్తోంది.
లాభాలు ఇలా..
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో 22 మార్చి 2022లో నీమ్ కోటెడ్ యూ రియా ఉత్పత్తి ప్రారంభించారు. దీంతో 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.15.23 కోట్లు, 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.440.96 కోట్లు, 2024–25 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.510 కోట్ల ఆదాయం సాధించారు.
ఉత్పత్తి లక్ష్యం 12.74 లక్షల మెట్రిక్ టన్నులు
సాధించింది 11,94,921.17 మెట్రిక్ టన్నులు
వార్షికాదాయం అంచనా సుమారు రూ.510 కోట్లు


