మార్కెట్ కమిటీలకు ‘లక్ష్మీ’ కటాక్షం
రాజన్నకు సెలవుల రద్దీ
వేములవాడ: ఎములాడ రాజన్నకు వరుస సెలవుల రద్దీ పెరిగింది. మంగళవారం 20 వేల మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బద్ది పోచమ్మకు బోనం, ఒడిబియ్యం, కల్లుసాక, సమర్పించుకున్నారు. భక్తుల ఏర్పాట్లను ఆలయ అధికారులు పరిశీలించారు.
● ధాన్యం సేకరణతో రూ.20.69 కోట్ల ఆదాయం
● మొదటి స్థానంలో ధర్మపురి, చివరిస్థానంలో ఇబ్రహీంపట్నం
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల పూర్తిగా వ్యవసాయాధారిత జిల్లా. సాగునీటి వనరులు పుష్కలంగా ఉండటంతో గతేడాది అన్ని పంటలు పుష్కలంగా పండాయి. రైతులతోపాటు మార్కెట్ కమిటీలకూ భారీగా ఆదాయం సమాకూరింది. ఈ నేపథ్యంలో మార్కెట్ కమిటీలు 2024–25 ఆర్థిక సంవత్సరంలో ‘లక్ష్మీ’ కటాక్షంతో కళకళలాడుతున్నాయి. జిల్లాలో లక్ష్యాన్ని మించి అత్యధికంగా ఆదాయం సంపాదించిన దాంట్లో మొదటి స్థానంలో ధర్మపురి మార్కెట్ నిలిచింది. చివరి స్థానంలో ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ నిలిచింది.
జిల్లాలో 13 వ్యవసాయ మార్కెట్ కమిటీలు
జిల్లాలో జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, గొల్లపల్లి, ధర్మపురి, మల్యాల, కథలాపూర్, మేడిపల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, పెగడపల్లి, వెల్గటూర్, రాయికల్ ఇలా మొత్తం 13 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఈ మార్కెట్ యార్డులకు రైతులు తమ పంట ఉత్పత్తులను తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. కొనుగోలు చేసిన వ్యాపారులు ఉత్పత్తుల విలువపై ఒక శాతం ఫీజును మార్కెట్ కమిటీలకు చెల్లిస్తుంటారు. గ్రామాల్లో నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసినా ఆ వ్యాపారులు కూడా సంబంధిత మార్కెట్‌కు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వ్యాపారులే కాకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే సివిల్ సప్‌లై, మార్క్‌ఫెడ్ వంటి సంస్థలు కూడా ఫీజు చెల్లిస్తుంటాయి. ఇటీవలి కాలంలో ప్రభుత్వ సంస్థలు రైతుల నుంచి ధాన్యం, మొక్కజొన్న, కందులు, మినుములు, శనగలు వంటివి కొనుగోలు చేస్తుండటంతో మార్కెట్ ఫీజు చెల్లించడం కొంచెం ఆలస్యమైనా భారీగానే ఆదాయం వస్తోంది.
రికార్డు స్థాయిలో ఉత్పత్తితోనే ఆదాయం
జిల్లాలో ప్రతి సీజన్‌లో కనీసం 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తుంటారు. ఇందులో 3 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది. వానాకాలం, యాసంగి సీజన్‌లోనే దాదాపు 10 నుంచి 12 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. మొక్కజొన్న కూడా రెండు సీజన్లలో కలిపి దాదాపు 5 నుంచి 6 లక్షల క్వింటాళ్లు దిగుబడి అవుతుంది. కందులు, పెసర్లు, అలిసంద, నువ్వులు, పత్తి, పసుపు వంటి ఉత్పత్తులు అమ్ముతుంటారు. కొన్నేళ్లుగా జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల మార్కెట్ కమిటీలకు మామిడి కాయల అమ్మకం ద్వారా మార్కెట్ ఫీజు బాగానే వస్తోంది. ఇతర జిల్లాల్లో రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పటికీ అక్కడ మార్కెట్ ఫీజు చెల్లించలేదంటే.. చెక్ పోస్టుల ద్వారా కూడా ఫీజు వసూలవుతుంది.
లక్ష్యాన్ని మించి ఆదాయం
ఐదేళ్లలో సాధించిన ఆదాయం ప్రకారం జిల్లాలోని మార్కెట్ కమిటీలకు ఏటా లక్ష్యాన్ని నిర్దేశిస్తుంటారు. జిల్లాలోని 13 మార్కెట్ కమిటీల్లో జగిత్యాల, ధర్మపురి, మల్యాల, కథలాపూర్, మేడిపల్లి, మల్లాపూర్, పెగడపల్లి, వెల్గటూర్, రాయికల్ మార్కెట్‌లు మాత్రమే లక్ష్యాన్ని మించి ఆదాయాన్ని అర్జించాయి. జిల్లాలో రూ.15.98 కోట్ల లక్ష్యానికి రూ.20.69 కోట్ల ఆదాయాన్ని(129.47 శాతం)సాధించాయి. రాబోయే ఏడాదిలోనూ మంచి ఆదాయాన్ని సంపాదించేందుకు మార్కెట్ కమిటీలు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.
జిల్లాలోని మార్కెట్ కమిటీల లక్ష్యం, ఆదాయం (రూ.కోట్లలో..), శాతం
మార్కెట్ కమిటీ లక్ష్యం ఆదాయం శాతం
జగిత్యాల 2.61 2.79 106.71
మెట్‌పల్లి 1.75 1.31 74.90
కోరుట్ల 1.47 1.01 68.80
గొల్లపల్లి 8.8 8.4 95.86
ధర్మపురి 1.81 4.86 267.45
మల్యాల 1.62 3.56 220.14
కథలాపూర్ 1.05 1.25 119.76
మేడిపల్లి 9.3 11.6 124.37
మల్లాపూర్ 7.0 8.3 105.01
ఇబ్రహీంపట్నం 4.6 3.4 74.19
పెగడపల్లి 7.5 8.4 111.74
వెల్గటూర్ 1.12 1.12 100.52
రాయికల్ 6.9 7.2 103.81
మొత్తం 15.98 20.69 129.47
మార్కెట్లలో వసతులు కల్పించాలి
జిల్లాలోని అన్ని మార్కెట్‌లలో సరైన వసతులు కల్పించాలి. రైతులకు విశ్రాంతి భవనాలు నిర్మించాలి. మంచి నీటి సదుపాయాలు, మూత్రశాలలు సరిగ్గా లేవు. రైతుల ఉత్పత్తుల అమ్మకం ద్వారా మార్కెట్‌లకు వచ్చే అదాయాన్ని అభివృద్ధికే ఖర్చు చేయాలి.
– వేముల కర్ణాకర్‌రెడ్డి, తీగలధర్మారం, ఽ
ధర్మపురి మండలం
ఆదాయం సంపాదించాం
జిల్లాలోని అన్ని మార్కెట్లలో లక్ష్యాన్ని మించి 129.47 శాతంతో ఈ ఏడాది రూ 20.69 కోట్ల ఆదాయాన్ని సాధించాం. మార్కెట్ ఫీజును కచ్చితంగా వసూలు చేయడంతోనే అనుకున్న లక్ష్యాన్ని సాధించాం. ఈ మేరకు అయా మార్కెట్లలోని మార్కెట్ సిబ్బంది రాత్రిబవళ్లు పనిచేస్తున్నారు.
– ప్రకాష్, మార్కెటింగ్ అధికారి, జగిత్యాల
మార్కెట్ కమిటీలకు ‘లక్ష్మీ’ కటాక్షం
మార్కెట్ కమిటీలకు ‘లక్ష్మీ’ కటాక్షం
మార్కెట్ కమిటీలకు ‘లక్ష్మీ’ కటాక్షం
మార్కెట్ కమిటీలకు ‘లక్ష్మీ’ కటాక్షం
మార్కెట్ కమిటీలకు ‘లక్ష్మీ’ కటాక్షం
మార్కెట్ కమిటీలకు ‘లక్ష్మీ’ కటాక్షం


