ఉత్సాహంగా ‘అల్ఫోర్స్ ప్రథమోత్సవ్’
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్‌లోని అల్ఫోర్స్ బాలికల ఇ టెక్నో స్కూల్ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో బుధవారం ‘అల్ఫోర్స్ ప్రథమోత్సవ్’ పేరిట నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలను అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వార్షిక ప్రణాళికలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీ పరీక్షలు, ప్రతిభా పాటవ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.


