కరీంనగర్‌స్పోర్ట్స్: ఒడిశా రాష్ట్రంలోని పూరిలో ఈనెల 4వ తేదీ వరకు జరుగనున్న 57వ సీనియర్స్ జాతీయ ఖోఖో పోటీల్లో పాల్గొనే తెలంగాణ జట్లకు ఉమ్మడి జిల్లాకు చెందిన పండుగ ఆనంద్ కుమార్, ఇస్లావత్ నరేష్ కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు.
రాష్ట్ర పురుషుల జట్టుకు ఇల్లంతకుంటకు చెందిన రైల్వే క్రీడాకారుడు పూర్వ భారత జట్టు కెప్టెన్ పండుగ ఆనంద్, జాతీయ పోటీల్లో పాల్గొంటున్న భారత పురుషుల రైల్వే జట్టుకు ధర్మారం మండలం బంజరుపల్లి తండాకు చెందిన దక్షిణ మధ్య రైల్వే క్రీడాకారుడు ఇస్లావత్ నరేశ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.మహేందర్ రావు తెలిపారు. వీరిని సంఘ బాధ్యులు చిట్టి తిరుపతిరెడ్డి, కుమారస్వామి, ఏ.రవీందర్, లక్ష్మణ్, ఎస్కే మోహినుద్దీన్, సీఐ కుమారస్వామి, ఎస్సై రమేశ్, బి.శేఖర్, నవీన్, ఆర్.తిరుపతిరెడ్డి అభినందించారు.
కారు ఢీకొని విద్యార్థులకు గాయాలు
ధర్మపురి: కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్న ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్న విద్యార్థులను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ధర్మపురికి చెందిన సంతోష్ బుధవారం సాయంత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నాడు.
అదే సమయంలో మైదానంలో మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కళావాల విద్యార్థులు కూర్మాదాస్, వినయ్ వాకింగ్ చేస్తున్నారు. కారు అదుపు తప్పి వీరిని ఢీకొట్టింది. ప్రహరీ, కారు మధ్యలో విద్యార్థులు ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను 108 అంబులెన్సులో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.
జాతీయ ఖోఖో పోటీలకు కోచ్‌లుగా ఉమ్మడి జిల్లావాసులు
జాతీయ ఖోఖో పోటీలకు కోచ్‌లుగా ఉమ్మడి జిల్లావాసులు
జాతీయ ఖోఖో పోటీలకు కోచ్‌లుగా ఉమ్మడి జిల్లావాసులు


