పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి | - | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి

Apr 4 2025 1:49 AM | Updated on Apr 4 2025 1:49 AM

పీహెచ

పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి

కరీంనగర్‌టౌన్‌: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని, మొదటి కాన్పు సాధారణంగా అయ్యేలా చూడాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటరమణ ఆదేశించారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో గురువారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణ ఆరోగ్య కేంద్రం, బస్తీ దవాఖానా వైద్యాధికారులు, ఎంఎల్‌హెచ్‌పీలతో సమీక్ష నిర్వహించా రు. 30ఏళ్ల వయస్సు పైబడిన వారికి అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్‌ ఇంప్రూవ్‌ చేయాలని ఆదేశించారు. క్షయ నివారణ అధికారి రవీందర్‌రెడ్డి క్షయ నివారణలో టార్గెట్‌ను పూర్తిచేయాలన్నారు. ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్‌ విప్లవశ్రీ, సనజవేరియా, డీఐవో సాజిదా, చందు, డెమో రాజగోపాల్‌ పాల్గొన్నారు.

అభ్యసన ఫలితాలపై దృష్టి పెట్టాలి

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): ఉపాధ్యాయులు అభ్యసన ఫలితాలపై దృష్టి పెట్టాలని డీఈవో జనార్దన్‌రావు పేర్కొన్నారు. పదోన్నతి పొంది న ఉపాధ్యాయులకు సుభాష్‌నగర్‌, సప్తగిరి కాలనీ, మంకమ్మతోట ఉన్నత పాఠశాలల్లో జ రుగుతున్న శిక్షణ కార్యక్రమాలను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థుల తరగతి గది సామర్థ్యాల సాధనపై దృష్టి పెట్టా లన్నారు. విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని వివిధ నివేదికలు తెలియజేస్తున్నాయని, ఉపాధ్యాయులు మరింత జాగ్రత్తతో విద్యాబోధన చేయాలన్నారు. అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి కర్ర అశోక్‌రెడ్డి, స్టేట్‌ రిసోర్స్‌ పర్సన్‌ గాజుల రవీందర్‌ పాల్గొన్నారు.

నేటి నుంచి ప్రభుత్వాసుపత్రి కార్మికుల సమ్మె

కరీంనగర్‌టౌన్‌: మూడు నెలల పెండింగ్‌ వేతనాల కోసం కరీంనగర్‌ జనరల్‌ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఏజిల్‌ గ్రూప్‌ కాంట్రాక్టు కార్మికులు సమ్మె బాట పట్టారు. గతంలోనే ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వీరారెడ్డికి సమ్మె నోటీసు ఇవ్వగా శుక్రవారం నుంచి నిరవధిక సమ్మె చేసేందుకు నిర్ణయించారు. గురువారం ఆసుపత్రి ఆవరణలో యూనియన్‌ గౌరవాధ్యక్షుడు బండారి శేఖర్‌ మాట్లాడుతూ వేతనాలు చెల్లించేవరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. ప్రతినెల 5వ తేదీలోపు కార్మికుల జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 500 బెడ్సుకు బిల్లు వచ్చే విధంగా జీవో అమలు చేయాలన్నారు. కార్మికులకు గుర్తింపు కార్డులు, రెండు జతల బట్టలు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అధ్యక్షుడు పి.అరుణ్‌, కార్యదర్శి కళావతి, కార్మికులు పాల్గొన్నారు.

పంచాయతీ కార్మికుల సమ్మె నోటీసు

సప్తగిరికాలనీ(కరీంనగర్‌): తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ సీఐటీయూ అనుబంధం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం డీపీవో వి.జగదీశ్వర్‌కు సమ్మె నోటీసు ఇచ్చారు. ఏప్రిల్‌ 19 తరువాత సమ్మెకు వెళ్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023లో పలు డిమాండ్ల సాధన కోసం 33రోజులు సమ్మె చేసినప్పటికీ, ప్రభుత్వం పట్టించుకోగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగ భద్రత కల్పిస్తామని నెరవేర్చలేదన్నారు. కార్మికులకు ఇచ్చిన హామీని అమలు పరచాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్‌ డిమాండ్‌ చేశారు. యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు రాచర్ల మల్లేశం, ఉపాధ్యక్షుడు కాశిపాక శంకర్‌, కోశాధికారి ఎండిగ రవీందర్‌, మొలుగురు ప్రేంకుమార్‌, శంకర్‌, వడ్లూరి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

పీహెచ్‌సీల్లో ప్రసవాల   సంఖ్య పెంచాలి
1
1/3

పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి

పీహెచ్‌సీల్లో ప్రసవాల   సంఖ్య పెంచాలి
2
2/3

పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి

పీహెచ్‌సీల్లో ప్రసవాల   సంఖ్య పెంచాలి
3
3/3

పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement