రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మల్లాపూర్: మండలంలోని వేంపల్లి శివారులో గురువారం రా త్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం మ ల్లాపూర్‌కి చెందిన సుర దివాకర్ (42) రాయికల్ మండలం కొత్తపేటలో బంధువుల ఇంటికి వెళ్లాడు. ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా.. రాయికల మండలం మూటపెల్లిలో మేసీ్త్ర పనులు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు కూలీలు ద్విచక్రవాహనంపై వేంపల్లిలో కూరగాయలు తీసుకుని మూటపెల్లికి వస్తున్నారు. గ్రామ శివారులో అతివేగంగా వచ్చి దివాకర్ బైక్‌ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో దివాకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో బైక్‌పై ఉన్న ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఎస్సై రాజు విచారణ చేపట్టారు.


