అలరించిన ‘అల్ఫోర్స్‌ ఆరేవోయిర్‌ 2025’ | - | Sakshi
Sakshi News home page

అలరించిన ‘అల్ఫోర్స్‌ ఆరేవోయిర్‌ 2025’

Apr 6 2025 1:57 AM | Updated on Apr 6 2025 1:57 AM

అలరించిన ‘అల్ఫోర్స్‌ ఆరేవోయిర్‌ 2025’

అలరించిన ‘అల్ఫోర్స్‌ ఆరేవోయిర్‌ 2025’

కొత్తపల్లి(కరీంనగర్‌): కరీంనగర్‌ సూర్యనగర్‌లోని అల్ఫోర్స్‌ మహిళా డిగ్రీ కళాశాల ఫేర్‌వెల్‌ పార్టీ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. స్థానిక ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో శనివారం అల్ఫోర్స్‌ ఆరేవోయిర్‌ 2025 పేరిట నిర్వహించిన ఈ వేడుకలను అల్ఫోర్స్‌ మహిళా డిగ్రీ, పిజి కళాశాల కరస్పాండెంట్‌ వి.రవీందర్‌ రెడ్డితో కలిసి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులు ఉద్యోగాల్లో రాణించాలంటే విషయ పరిజ్ఞానం ఒక్కటే సరిపోదని, నైపుణ్యాలను పెంపొందించుకోవల్సిన అవసరం ఉందన్నారు. డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు వివిధ బహుళజాతి కంపెనీల్లో ప్రాంగణ నియాకమాల్లో ఎంపికై న విద్యార్థులను జ్ఞాపికలతో సత్కరించారు. కళాశాల ప్రిన్పిల్‌ గోలి శ్రీనివాస్‌, వైస్‌ ప్రిన్సిపాల్స్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement